దిగ్భ్రాంతికర సంఘటన. భర్తను బెదిరిస్తూ భార్యకు వాతలు .***రాజకీయాలపై అప్పుడు స్పందిస్తా: JD లక్ష్మీనారాయణ***దిల్లీపై ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోహ్లీ***ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల***సినీ హీరో తండ్రికి జైలు శిక్ష . బ్యాంకు మోసం కేసులో కోర్టు తీర్పు***తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు***జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి - కుప్ప‌కూలిన స‌భ వేదిక‌***కోహ్లీకి-ధోనీకి ఇదే తేడా! కోహ్లీ.. కాస్త దూకుడు తగ్గించుకో***సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు***ప్రభుత్వం సంచలన నిర్ణయం
దిగ్భ్రాంతికర సంఘటన. భర్తను బెదిరిస్తూ భార్యకు వాతలు .

దిగ్భ్రాంతికర సంఘటన. భర్తను బెదిరిస్తూ భార్యకు వాతలు .

ఇదో దిగ్భ్రాంతికర సంఘటన. రాజకీయాల నుంచి వైదొలగాలని ఓ వ్యక్తిని బెదిరించడానికి ఓ More »

రాజకీయాలపై అప్పుడు స్పందిస్తా: JD లక్ష్మీనారాయణ

రాజకీయాలపై అప్పుడు స్పందిస్తా: JD లక్ష్మీనారాయణ

ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతానో బాగా ఆలోచించుకున్న తర్వాతే రాజకీయాల్లోకి వచ్చే అంశంపై More »

దిల్లీపై ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోహ్లీ

దిల్లీపై ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోహ్లీ

బెంగళూరు: ఐపీఎల్‌లో భాగంగా చిన్నస్వామి మైదానం వేదికగా జరిగే మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ More »

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం.. ఈనెల More »

సినీ హీరో తండ్రికి జైలు శిక్ష . బ్యాంకు మోసం కేసులో కోర్టు తీర్పు

సినీ హీరో తండ్రికి జైలు శిక్ష . బ్యాంకు మోసం కేసులో కోర్టు తీర్పు

బ్యాంకులో పని చేస్తూ… నకిలీ బంగారాన్ని కుదువ పెట్టి రుణం పొందిన కేసులో More »

 

దిగ్భ్రాంతికర సంఘటన. భర్తను బెదిరిస్తూ భార్యకు వాతలు .

ఇదో దిగ్భ్రాంతికర సంఘటన. రాజకీయాల నుంచి వైదొలగాలని ఓ వ్యక్తిని బెదిరించడానికి ఓ పార్టీ నేతలు పైశాచికంగా ప్రవర్తించారు. వ్యాహ్యాళికి వెళ్లిన ఆయన భార్య చేతిపై దుండగులు వాతలు పెట్టారు! ఈ దారుణ ఘటన వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. అక్షర సత్యమని బాధితురాలి భర్త వాపోయారు. భాజపా జిల్లా శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర మాగనూరు యాదగిరి నియోజకవర్గం నుంచి మరోసారి పోటీకి ప్రయత్నిస్తున్నారు. గురువారం సురపుర తాలూకా రాజనకోళూరు గ్రామంలో భార్య శిల్ప వ్యాహ్యాళికి వెళ్లిన సమయంలో

రాజకీయాలపై అప్పుడు స్పందిస్తా: JD లక్ష్మీనారాయణ

ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతానో బాగా ఆలోచించుకున్న తర్వాతే రాజకీయాల్లోకి వచ్చే అంశంపై స్పందిస్తానని సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం విశాఖ వచ్చిన ఆయన సీతమ్మధారలోని వినాయక ఆలయాన్ని సందర్శించారు. వేదపండితులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇటీవల స్వచ్ఛంద ఉద్యోగ

దిల్లీపై ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోహ్లీ

బెంగళూరు: ఐపీఎల్‌లో భాగంగా చిన్నస్వామి మైదానం వేదికగా జరిగే మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టాస్‌ గెలిచింది. ఆ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ దిల్లీని మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తమ జట్టులో సర్ఫరాజ్‌ ఖాన్‌ స్థానంలో మనన్‌ వోహ్రాను తీసుకున్నట్టు కోహ్లీ పేర్కొన్నాడు. దిల్లీలో షమి స్థానంలో హర్షల్‌ పటేల్ వస్తున్నాడు. ‌

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవనుంది. మే 3 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 4న పరిశీలన, మే 21న పోలింగ్, 24న కౌంటింగ్ ప్రక్రియ చేపడుతారు. దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు హఠాన్మరణంతో ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యం అయింది. చిత్తూరు స్థానిక సంస్థల అభ్యర్థిగా ముద్దుకృష్ణమ గెలిచారు .

సినీ హీరో తండ్రికి జైలు శిక్ష . బ్యాంకు మోసం కేసులో కోర్టు తీర్పు

బ్యాంకులో పని చేస్తూ… నకిలీ బంగారాన్ని కుదువ పెట్టి రుణం పొందిన కేసులో సినీహీరో రాజ్‌తరుణ్‌ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం కోర్టు తీర్పునిచ్చింది. విశాఖపట్నంలోని వేపగుంట ప్రాంతానికి చెందిన బసవరాజు (53) సింహాచలం స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో 2013లో స్పెషల్‌ అసిస్టెంట్‌ క్యాషియర్‌గా విధులు నిర్వహించేవారు. అప్పట్లోనే తన భార్య రాజ్యలక్ష్మితో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ఎం.ఎస్‌.ఎన్‌.రాజు, ఎన్‌.సన్యాసిరాజు, కె.సాంబమూర్తి, ఎన్‌.వెంకట్రావు పేర్ల మీద నకిలీ బంగారాన్ని బ్యాంకులో కుదువ(తాకట్టు)పెట్టి

తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు

హైదరాబాద్‌: ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా హనుమంతరావుకు నివాళులు అర్పించేందుకు బ్రహ్మానందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఎస్సార్‌ నగర్‌లోని ఆయన నివాసానికి వచ్చారు. హనుమంతరావుతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. * ‘గుండు హనుమంతరావు చనిపోయారన్న వార్త వినగానే అసలు నమ్మశక్యం కాలేదు. ఎందుకంటే నాకు, శివాజీ రాజాకు, హనుమంతరావుకు ఉన్న అనుబంధం అలాంటిది. ఆయన చనిపోయారనగానే ఏదో తెలీని అలజడి.

జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి – కుప్ప‌కూలిన స‌భ వేదిక‌

శ్రీకాళహస్తి: వైకాపా అధినేత జగన్‌ చేపట్టిన పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక కుప్పకూలింది. సాంస్కృతిక కార్యక్రమాలకు వీలుగా చెక్కలతో చేసిన వేదికపై కార్యకర్తలు ఎక్కువగా చేరుకోవటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళా సహా ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వేదిక సరిగా లేకపోవటంతో జగన్ బస్సుపై నుంచి మాట్లాడుతూ బహిరంగ సభను కొనసాగించారు.