రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌
రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

దిల్లీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే ముహూర్తం ఖరారైంది. పార్టీ More »

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియరంజన్‌ More »

మరో మూడు రోజుల పాటు  అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు

మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పనిదినాలను పొడిగించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసన అనంతరం More »

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

హైదరాబాద్‌ నగరంలోని ఉప్పల్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఎస్‌ఐ అక్కడికక్కడే మృతిచెందారు. అంబర్‌పేట పోలీస్‌ More »

జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం

జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం

వైకాపా అధినేత జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. More »

 

Category Archives: image scrolling

ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?

ఏపీ డీజీపీగా సాంబశివరావును కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన జాబితాను యూపీఎస్సీ వెనక్కి పంపింది. దీంతో రెండోసారి సాంబశివరావు పేరును ప్రభుత్వం సూచించనుంది. గతేడాది జులైలో రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సాంబశివరావు 1984వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. డిసెంబర్‌లో ఆయన పదవీవిరమణ పొందనున్నారు.

సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పాదయాత్ర నేపథ్యంలో శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. పాదయాత్ర విజయవంతం కావాలని ఏడుకొండలవాడిని వేడుకున్నారు. శ్రీనివాసుడి ఆశీస్సుల కోసం తిరుమల కొండకు వచ్చిన జగన్.. అక్కడ డిక్లరేషన్ బుక్‌లో సంతకం పెట్టకుండానే దర్శనానికి వెళ్లిపోయారు. సాధరణంగా హిందూయేతరులు శ్రీవారిని దర్శించుకునే సమయంలో శ్రీవారిపై తమకు నమ్మకం ఉందంటూ టీటీడీకి డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే జగన్ ఆ డిక్లరేషన్‌ను ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా శ్రీవారి దర్శనం కోసం

122 మంది సీఐలకు ప్రమోషన్‌

తెలంగాణ పోలీస్‌ శాఖలో పదోన్నతుల సందడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న122 మంది సీఐలను డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ అనురాగ్‌ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీఎస్పీలుగా పని చేస్తున్న 55 మందిని వివిధ పోస్టుల్లోకి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

TDP లో చేరిన వైకాపా ఎమ్మెల్యే

వైకాపా నుంచి మరో ఎమ్మెల్యే తెదేపాలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే, వైకాపా నేత వంతల రాజేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆయన నివాసంలో ఈ ఉదయం కలిశారు. చంద్రబాబు సమక్షంలో తన అనుచరులతో కలిసి ఆమె తెదేపాలో చేరారు. దీంతో ఇప్పటి వరకూ వైకాపాను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య 22కి చేరింది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను తెదేపాలో చేరినట్లు రాజేశ్వరి తెలిపారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని

సీఐకి హోంగార్డు మసాజ్‌

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌ సీఐ లింగయ్య ఓ వివాదంలో చిక్కుకున్నారు. హోంగార్డుతో సీఐ మసాజ్‌ చేయించుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. హోంగార్డుతో రోజు ఇంటిపనులు చేయించుకోవడంతోపాటు బాడీ మసాజ్‌ కూడా చేయించుకుంటున్నట్లు ఆ దృశ్యాల్లో ఉన్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. అయితే దీనిపై సీఐ స్పందించారు. ఈ వీడియో తనది కాదని కొట్టపారేశారు. తానెప్పుడూ ఇలాంటి వ్యక్తిగత పనుల కోసం సిబ్బందిని వినియోగించుకోనని చెబుతున్నారు.

తెదేపాలో చేరిన వైకాపా ఎంపీ బుట్టా రేణుక

అమరావతి : వైకాపా ఎంపీ బుట్టా రేణుక తెదేపాలో చేరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. మంగళవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో బుట్టా రేణుకతోపాటు కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ఆనాటి తొమ్మిదేళ్ల చంద్రబాబు పరిపాలనను స్వర్ణయుగంగా పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ఎంపీలు చంద్రబాబు

సహాయ కమిషనర్‌ ఇళ్లల్లో ACB సోదాలు

అవినీతి నిరోధక శాఖ వలకు ఆబ్కారీశాఖ సహాయ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న అభియోగాలతో శ్రీనివాస్‌రెడ్డి ఇళ్లల్లో అనిశా అధికారులు సోదాలు చేపట్టారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి రామరాజుకాలనీలోని ఆయన నివాసంలో అనిశా డీఎస్పీ సునీత, రవికుమార్‌ ఆధ్వర్యంలో 10 మంది సభ్యుల బృందం తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో విలువైన ధ్రువపత్రాలు, నగదు, నగలు, బ్యాంక్‌ పాస్‌ బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌ పట్టణంలోని జ్యోతినగర్‌లోని ఆయన సోదరుడి ఇంటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 10 చోట్ల ఏకకాలంలో