రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌
రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

దిల్లీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే ముహూర్తం ఖరారైంది. పార్టీ More »

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియరంజన్‌ More »

మరో మూడు రోజుల పాటు  అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు

మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పనిదినాలను పొడిగించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసన అనంతరం More »

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

హైదరాబాద్‌ నగరంలోని ఉప్పల్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఎస్‌ఐ అక్కడికక్కడే మృతిచెందారు. అంబర్‌పేట పోలీస్‌ More »

జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం

జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం

వైకాపా అధినేత జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. More »

 

Category Archives: National

మరో జర్నలిస్టుపై కాల్పులు

బెంగళూరులో మంగళవారం రాత్రి ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి గౌరీ లంకేశ్‌ను దారుణంగా కాల్చి చంపిన ఘటన మరువక ముందే బిహార్‌లో మరో ఘటన కలకలం రేపింది. బిహార్‌లోని అరవల్‌లో పాత్రికేయుడు పంకజ్‌ మిశ్రాపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులో గాయపడిన మిశ్రా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మిశ్రా ప్రస్తుతం రాష్ట్రీయ సహారా పత్రికలో పనిచేస్తున్నారు. కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సోనియా భద్రతా సిబ్బంది అదృశ్యం

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నివాసం వద్ద భద్రత విధులు నిర్వహిస్తున్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ కమాండో ఒకరు అదృశ్యమయ్యారు. గత ఐదు రోజులుగా ఆ సిబ్బంది కన్పించకపోవడంతో దిల్లీ పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీలోని ద్వారకా ప్రాంతంలో నివాసముంటున్న రాకేశ్‌ కుమార్‌.. 10 జన్‌పథ్‌లోని సోనియాగాంధీ నివాసంలో భద్రత విధులు నిర్వహిస్తున్నారు.సెప్టెంబర్‌ 1న విధులకు హాజరైన రాకేశ్‌.. ఆ రోజున 11 గంటలకే తిరిగి వెళ్లిపోయారు. అయితే తనతోపాటు సర్వీస్‌ రివాల్వర్‌ను

తడబడ్డ మంత్రి

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్‌ తడబడ్డారు. కేబినెట్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఒక పదాన్ని పలకడంలో ఇబ్బందిపడ్డారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వెంటనే మరోసారి ఆ పదాన్ని స్పష్టంగా పలికించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్‌ హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా హిందీలో ‘సన్సూచిత్‌’కు బదులు ‘సముచిత్‌’ అని పలికారు. తప్పును గుర్తించిన రాష్ట్రపతి ‘సన్సూచిత్‌’ అని పలకాలంటూ సూచించారు. దీంతో

76కు చేరిన కేంద్ర కేబినెట్‌ సంఖ్య..ఇంకా 5 ఖాళీ

కేంద్రం గరిష్టంగా 81 మంది మంత్రులను నియమించుకోవచ్చు. ప్రస్తుతం ప్రధానితో సహా కేంద్ర మంత్రుల సంఖ్య 73. ఆరుగురు మంత్రులు రాజీనామా చేయటంతో ఈ సంఖ్య 67కు చేరింది. ఆదివారం 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే.. కేంద్ర కేబినెట్‌ సంఖ్య 76కు చేరుతుంది. అంటే కేంద్రం మరో ఐదుగురిని నియమించుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి జేడీయూ సహా ఎన్డీయే మిత్ర పక్షాలకు తాజా విస్తరణలో చోటు దక్కనందున.. అన్నీ సర్దుకున్నాక త్వరలోనే మరో

షాకింగ్ న్యూస్ … జైలులో ఉన్నది డూప్లికేట్ డేరా బాబా?

సునారియా జైలులో 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ రామ్ రహీం అసలా? నకిలీనా అనే దానిపై సోషల్ మీడియాలో రసవత్తర చర్చ సాగుతోంది. బాబాకు సంబంధించిన వివిధ ఫొటోలు షేర్‌చేయడంతో ఈ ప్రశ్నతలెత్తుతోంది. సాధ్విల రేప్ కేసులో శిక్ష పడిన గుర్మీత్ సింగ్ డేరా సచ్చా సౌధాలో తన బర్త్ డే వీక్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాడు. వేడుకల చివరిరోజు ఆగస్టు 16న హర్యానా విద్యాశాఖ మంత్రి రామ్ విలాస్ శర్మ డేరా

9 మందికొత్త మంత్రులు వీరే

[కేంద్ర మంత్రి మండలి పునర్వ్యస్థీకరణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రపతిభవన్‌లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో కొత్తగా 9 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలు భారీ కసరత్తుతో కొత్త మంత్రులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు మరో 21 నెలలు సమయమే మిగిలి ఉండటం, వచ్చే ఏడాది లోపల కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చేపడుతున్న కేంద్ర మంత్రి మండలి విస్తరణలో ప్రభుత్వాధినేతగా

కొత్త మంత్రుల పేర్లు ఖరారు..

కేంద్ర మంత్రివర్గంలో చేరనున్న వారి జాబితా దాదాపు ఖరారైంది. ఈ జాబితాలో అశ్వనీ కుమార్‌ చౌబే, శివప్రతాప్‌ శుక్లా, వీరేంద్రకుమార్‌, అనంతకుమార్‌ హెగ్డే, రాజ్‌కుమార్‌ సింగ్‌, హరిప్రదీప్‌ సింగ్‌ పూరి, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, సత్యపాల్‌ సింగ్‌, అల్ఫాన్స్‌ కన్నంథనమ్‌లకు స్థానం దక్కనున్నట్లు తెలిసింది. మొత్తం తొమ్మిది మంది మంత్రులు మంత్రివర్గంలో చేరనున్నారు.