తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు***జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి - కుప్ప‌కూలిన స‌భ వేదిక‌***కోహ్లీకి-ధోనీకి ఇదే తేడా! కోహ్లీ.. కాస్త దూకుడు తగ్గించుకో***సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు***ప్రభుత్వం సంచలన నిర్ణయం***లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష***లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌***నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!***అనంత‌లో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర***త్రిపుర మాజీ డీజీపీ నాగరాజుకు సీబీఐ కోర్టు క్లీన్‌చిట్
తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు

తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు

హైదరాబాద్‌: ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున More »

జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి – కుప్ప‌కూలిన స‌భ వేదిక‌

జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి – కుప్ప‌కూలిన స‌భ వేదిక‌

శ్రీకాళహస్తి: వైకాపా అధినేత జగన్‌ చేపట్టిన పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా More »

కోహ్లీకి-ధోనీకి ఇదే తేడా! కోహ్లీ.. కాస్త దూకుడు తగ్గించుకో

కోహ్లీకి-ధోనీకి ఇదే తేడా! కోహ్లీ.. కాస్త దూకుడు తగ్గించుకో

సెంచూరియన్‌: బుధవారం సెంచూరియన్‌లో రెండో టెస్టు అనంతరం కోహ్లీ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం More »

సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

దిల్లీ: న్యాయచరిత్రలో తొలిసారిగా దేశ సర్వోన్నత న్యాయస్థాన సీనియర్‌ న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడారు. More »

ప్రభుత్వం సంచలన నిర్ణయం

ప్రభుత్వం సంచలన నిర్ణయం

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎర్నాకులంలోని వివాదాస్పద More »

 

Category Archives: Political

నంద్యాలలో తెదేపా ఘనవిజయం – తెదేపా శ్రేణుల సంబరాలు

నంద్యాల: నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘనవిజయం సాధించారు. 16 రౌండ్లు ముగిసేసరికే తెదేపా విజయం ఖాయమైంది. ఇంకా మూడు రౌండ్ల లెక్కింపు ఉండగానే 50శాతం ఓట్లు సాధించిన భూమా బ్రహ్మానందరెడ్డి.. వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగిన తెదేపా అదే హవాను చివరి వరకు కొనసాగించింది.

కర్నూలు జిల్లాలో ప్రతి ఉప పోరూ ప్రత్యేకమే

రాష్ట్రం యావత్తు నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నిక జిల్లాలో పదహారోది. రాజకీయ ప్రాధాన్యం ఉన్న కర్నూలు జిల్లాలో ఇంతవరకు 16 ఉప ఎన్నికలు శాసనసభకు జరిగాయి. మొదటి ఉప ఎన్నిక పత్తికొండ నియోజకవర్గంలో 1957లో జరిగింది. ఆ తర్వాత అత్యధిక ఉప ఎన్నికలు జిల్లాలోని నంద్యాల పొరుగున ఉన్న ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గంలో జరిగాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం అయిదు ఉప ఎన్నికలు జరిగాయి.

నాలుగో రౌండ్‌.. తెదేపా ఆధిక్యం 9,647

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి.. వైకాపా అభ్యర్థిపై 9,647 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకూ లెక్కింపు పూర్తయిన అన్ని రౌండ్లలో తెదేపా ఆధిక్యాన్ని కనబరిచింది. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆధిక్యం 10వేలకు చేరువ కావడంతో తెదేపా శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. మిగిలిన రౌండ్లలోనూ మంచి మెజార్టీ లభిస్తుందని ధీమాగా ఉన్నారు. నంద్యాలలో అభివృద్ధి మంత్రం పనిచేసిందని.. తమ పార్టీకి భారీ మెజార్టీ ఖాయమని హర్షం

కిర్లంపూడిలో తీవ్ర ఉత్కంఠ – చేతులు ఎత్తేసిన పోలీసులు

భారీ మద్దతుదారులతో పాదయాత్ర చేపట్టిన ముద్రగడ చేతులు ఎత్తేసిన పోలీసులు కిర్లంపూడి: గత కొన్నిరోజులుగా ‘ఛలో అమరావతి’ పేరిట పాదయాత్ర చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు గడప దాటారు. భారీ మద్దతుదారుల నడుమ పోలీసుల నిర్బంధాన్ని బేఖాతరు చేస్తూ ఆయన ఆదివారం పాదయాత్ర ప్రారంభించారు. తన నివాసం నుంచి బయలుదేరి రాజుపాలెం మీదుగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. కాపులకు బీసీ రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ గత కొన్నిరోజులుగా పాదయాత్ర చేసేందుకు ముద్రగడ చేస్తున్న

కాకినాడలో కాంగ్రెస్ ర్యాలీ .

కొద్దిసేపటి క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు ఎన్‌. ర‌ఘువీరారెడ్డి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్విచక్ర వాహనాల ర్యాలీని చేపట్టారు. ఈ ఉద‌యం 9-30 నిమిషాల‌కు 31వ వార్డు పరిధిలోని బ్యాంకు పేట నుంచి ర్యాలీ ప్రారంభంకాగా, వివిధ వార్డుల గుండా సాగే ర్యాలీ, అన్న‌మ్మ ఘాట్ మీదుగా దేవాల‌యం వరకూ సాగనుంది. ఆపై కాకినాడు జిల్లా కాంగ్రెస్ కార్యాల‌యంకు బైక్ ర్యాలీ చేరుకోనుండగా, అక్కడ జరిగే సభతో కాంగ్రెస్ ప్రచారం ముగియనుంది. తెలుగుదేశం,

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ సీట్లు: కేసీఆర్‌

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామని తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వారిని గెలిపించే బాధ్యత తనదేనని చెప్పారు. రైతు సంఘాల ఏర్పాటులో ప్రజా ప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషించాలని తెరాస శాసనసభ్యులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, పార్టీ సంస్థాగత అంశాలే ప్రధాన అజెండాగా నేడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. భూసమగ్ర సర్వే ద్వారా బినామీలను అడ్డుకట్ట వేయనున్నట్లు చెప్పారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ఘనస్వాగతం

విజయవాడ : ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా స్వరాష్ట్రానికి విచ్చేసిన వెంకయ్యనాయుడుకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వాగత ర్యాలీ ప్రారంభమైంది. ప్రత్యేక వాహనంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. లక్ష మందితో 23 కి.మీ మేర ప్రకాశం బ్యారేజీ వరకు ఈ స్వాగత