కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

ఎంఎస్‌ సుబ్బుల‌క్ష్మి కుమార్తె కన్నుమూత

బెంగళూరు: కర్ణాటక సంగీత కళాకారిణి, గాయకురాలు, దివంగత ఎంఎస్‌ సుబ్బుల‌క్ష్మి కుమార్తె రాధా విశ్వనాథన్‌ (83) కన్నుమూశారు. శ్వాసకోస సంబంధిత ఇబ్బందులతో ఇక్కడి ఫోర్టిస్‌ ఆస్పత్రిలో మంగళవారం చేరిన ఆమె గత అర్ధరాత్రి కన్నుమూశారని ఆమె కుమారుడు శ్రీనివాసన్‌ తెలిపారు.
ప్రముఖ సంగీత కళాకారిణి, భారతరత్న అవార్డు గ్రహీత అయిన ఎంఎస్‌ సుబ్బుల‌క్ష్మితో పాటు రాధా విశ్వనాథన్‌ ఎన్నో కచేరీల్లో పాల్గొన్నారు. విదేశాల్లోనూ తల్లితో పాటు పలు ప్రదర్శనలు ఇచ్చారు. రాధా విశ్వనాథన్‌కు కుమారులు చంద్రశేఖర్‌, శ్రీనివాసన్‌, కుమార్తె శుభలక్ష్మితో పాటు ఇద్దరు మనమరాళ్లు ఉన్నారు.
ఇప్పటికీ పలు ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఇళ్లలో వినిపించే వెంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామం, భజగోవిందంలో సుబ్బులక్ష్మి గొంతుతో పాటు తన తల్లి రాధా విశ్వనాథన్‌ గొంతు కూడా వినిపిస్తుందని శ్రీనివాసన్‌ తెలిపారు. సుబ్బలక్ష్మి 88 ఏళ్ల వయసులో 2004లో మరణించారు.