కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

తెదేపా ఎంపీలు పార్లమెంటులో నిద్రపోతున్నారా? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విజయవాడ: విభజన చ‌ట్టంలో పేర్కొన్నవిధంగా రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేసి సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడలో కోరారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఋణం మంజూరు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించడం దారుణమన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిద్రపోతున్నారా? అని విమర్శించారు ప్రపంచ బ్యాంక్ రుణంతో రాజధాని నిర్మాణం చేస్తే రాష్ట్రాన్నివారికి తాకట్టు పెడుతున్నట్లేనని అన్నారు. నాలా బిల్లు ఆమోదించలేదని గవర్నర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానన్న భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడంపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.