తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు***జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి - కుప్ప‌కూలిన స‌భ వేదిక‌***కోహ్లీకి-ధోనీకి ఇదే తేడా! కోహ్లీ.. కాస్త దూకుడు తగ్గించుకో***సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు***ప్రభుత్వం సంచలన నిర్ణయం***లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష***లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌***నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!***అనంత‌లో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర***త్రిపుర మాజీ డీజీపీ నాగరాజుకు సీబీఐ కోర్టు క్లీన్‌చిట్

రక్తదానం చేస్తే వేతనంతో సెలవు

దిల్లీ: రక్తదానం ప్రాణదానంతో సమానం. సకాలంలో రక్తం అందకపోవడం వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోతుండటం మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని గుర్తించిన అనేక స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే రక్తదానం ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ సైతం రక్తదానంపై ఓ ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాంటి గొప్ప ప్రాణదాన కార్యక్రమాన్ని మరింత స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రక్తదానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రక్తదానం చేసే ఉద్యోగులకు ఏడాదిలో నాలుగు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వలు జారీచేసింది.ప్రస్తుత నిబంధనల ప్రకారం పూర్తిగా రక్తదానానికి సెలవులు మంజూరు చేస్తున్నారు. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులతో రక్తదానంతో పాటు రక్తంలోని కణాలు, ప్లాస్మా, రక్తఫలికికలు (ప్లేట్‌లెట్స్‌) వంటి వాటిని దానం చేసేవారికి సైతం ఈ సెలవులు వర్తించనున్నాయి. అయితే, లైసెన్స్‌లు కల్గిన రక్తనిధిలోనే రక్తదానం చేయడమే కాకుండా అందుకు తగిన ఆధారాలను తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుంది.