కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

ఉద్యోగులకు పండుగే పండుగ

కోటి మంది ఉద్యోగులు, పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం శుభవార్త చెప్పింది. డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌లను ప్రస్తుతం ఉన్న 4 శాతం నుంచి 5 శాతానికి పెంచింది. దీనివల్ల 1.1 కోట్ల మంది ఉద్యోగులు, పింఛనుదారులు లబ్ధి పొందుతారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
49.26 లక్షల కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 61.17 లక్షల పింఛనుదారులు తమ బేసిక్ పే/పింఛనుపై 5 శాతం డీఏ, డీఆర్ పొందుతారు. కేంద్ర ప్రభుత్వంపై 2017 జూలై నుంచి 2018 ఫిబ్రవరి వరకు రూ.2,045.50 కోట్లు భారం పడుతుంది. ఏటా రూ.3,068.26 కోట్లు వ్యయమవుతుంది.
ప్రైవేటు ఉద్యోగుల కోసం గ్రాట్యుయిటీ పరిమితిని సవరించేందుకు ఉద్దేశించిన గ్రాట్యుయిటీ సవరణ బిల్లు, 2017ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *