రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌

సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పాదయాత్ర నేపథ్యంలో శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. పాదయాత్ర విజయవంతం కావాలని ఏడుకొండలవాడిని వేడుకున్నారు. శ్రీనివాసుడి ఆశీస్సుల కోసం తిరుమల కొండకు వచ్చిన జగన్.. అక్కడ డిక్లరేషన్ బుక్‌లో సంతకం పెట్టకుండానే దర్శనానికి వెళ్లిపోయారు. సాధరణంగా హిందూయేతరులు శ్రీవారిని దర్శించుకునే సమయంలో శ్రీవారిపై తమకు నమ్మకం ఉందంటూ టీటీడీకి డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే జగన్ ఆ డిక్లరేషన్‌ను ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా శ్రీవారి దర్శనం కోసం వచ్చినప్పుడు జగన్ డిక్లరేషన్ సమర్పించలేదు. ఇప్పుడు కూడా అదే రీతిలో డిక్లరేషన్ బుక్‌లో సంతకం పెట్టకుండానే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *