తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు***జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి - కుప్ప‌కూలిన స‌భ వేదిక‌***కోహ్లీకి-ధోనీకి ఇదే తేడా! కోహ్లీ.. కాస్త దూకుడు తగ్గించుకో***సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు***ప్రభుత్వం సంచలన నిర్ణయం***లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష***లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌***నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!***అనంత‌లో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర***త్రిపుర మాజీ డీజీపీ నాగరాజుకు సీబీఐ కోర్టు క్లీన్‌చిట్

సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు

గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సైకిల్ తొక్కారు. గుంటూరు జిల్లా పేరేచ‌ర్ల‌లో ఏర్పాటు చేసిన న‌గ‌ర వ‌నాన్ని ప్రారంభించిన సంద‌ర్భంగా ఆయ‌న సైకిల్‌పై చ‌క్క‌ర్లు కొట్టారు. అనంత‌రం సీఎం మాట్లాడుతూ.. నవ్యాంధ్రను హరితాంధ్రగా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ప్ర‌క‌టించారు. 2029 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకోసం ఏటా 25 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ జీవన విధానంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రకృతి వనరులతో ప్రతి ఒక్కరు మమేకం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మొక్కల పెంప‌కాన్ని సామాజిక బాధ్య‌త‌గా స్వీక‌రించాల‌ని సూచించారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చే లక్ష్యంతో పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టామన్నారు. రాజధాని పరిధిలో ఏర్పాటైన నగర వనం అమరావతికే ఒక ఆభరణంగా నిలుస్తుందని అన్నారు. 510 ఎకరాల్లో అటవీ శాఖ ఈ నగర వనాన్ని అభివృద్ధి చేస్తుంద‌న్నారు. దానిలో సైక్లింగ్ ట్రాక్‌లు, వాటర్ ఫాల్స్, ట్రెక్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని సీఎం సూచించారు. ఇందుకోసం తొలివిడ‌త‌గా రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

అభివృద్ధిలో ప్రజల ఆనందాన్ని కూడా ఒక సూచికలా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, ప్రజల ఆహ్లాదం కోసం ఇలాంటి నగర వనాలు ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సంప్రదాయ పండుగలతో పాటు సామాజిక పండుగలను జరుపుకోవాలని సూచించారు. అందుకే ఏరువాక పేరుతో వ్యవసాయ పండుగను, జలహారతి పేరుతో నీటి పండుగను, వనం-మనం పేరుతో మొక్కలు పెంచే పండుగను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు.మంత్రులతో కలిసి నగర వనంలోనే నిర్వ‌హించిన‌ రాష్ట్ర స్థాయి కార్తీక వనమహోత్సవంలో ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి కార్తీక వన భోజనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *