రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌

జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం

వైకాపా అధినేత జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం ఇడుపులపాయ చేరుకున్న జగన్‌ తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించిన జగన్‌ కొద్దిదూరంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సుమారు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాత్రికి వేంపల్లి చేరుకుని అక్కడే బస చేస్తారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వైకాపా నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు భారీ సంఖ్యలో ఇడుపులపాయ తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *