కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియరంజన్‌ దాస్‌ మున్షి(72) కన్నుమూశారు. దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటు కారణంగా పక్షవాతానికి గురైన ఆయన 2008 నుంచి కోమాలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం మరణించారు.
1999 నుంచి 2009వరకు ఎంపీగా, మన్మోహన్‌సింగ్‌ హయాంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా, 2004 నుంచి 2009 వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా మున్షి సేవలందించారు. పశ్చిమ్‌బంగలోని రాయ్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు 2009లో ఆయన భార్య దీపా ఎన్నికల బరిలో నిలిచారు. దాదాపు 20 సంవత్సరాల పాటు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడిగానూ మున్షి సేవలందించారు. ఆయన మృతి పట్ల పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పలువురు కాంగ్రెస్‌ నేతలు సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *