రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌

రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

దిల్లీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే ముహూర్తం ఖరారైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన సోమవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు చేశారు. డిసెంబర్‌ 1 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డిసెంబర్‌ 1న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. డిసెంబర్‌ 4న నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 16న ఎన్నికలు నిర్వహించి.. 19న ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే రాహుల్‌ గాంధీ తప్ప ఇంకేవరూ నామినేషన్‌ వేయకపోతే.. నామినేషన్ల పరిశీలన రోజే రాహుల్‌ను అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. డిసెంబర్‌ 5న రాహుల్‌ ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడిగా రాహుల్‌ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 2013లో రాహుల్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *