కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

అనంత‌లో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

అనంత‌పురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక‌ల్ప యాత్ర ముగిసింది. మొత్తం జిల్లాలో 20రోజుల పాటు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగింది. 9నియోజకవర్గాల్లో 280 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు భరోసానిస్తూ ముందుకు సాగారు. 150 గ్రామాల మీదుగా సాగిన పాదయాత్రలో ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెట్టుకున్నారు. నేటి (బుధవారం) ఉదయం కదిరి నియోజకవర్గంలోని నంబులపుల కుంట నుంచి వైఎస్‌ జగన్‌ 45వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి దిగువతువ్వపల్లి క్రాస్‌, కొత్తపల్లి క్రాస్‌, పాపన్నగారి పల్లి, పెడబల్లి మీదుగా సాగింది. రేప‌టి నుంచి చిత్తూరు జిల్లాలో జ‌గ‌న్ యాత్ర కొన‌సాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *