కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!

అనంతపురం: దిగ్విజయంగా కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో నేటితో ముగియనున్న నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘నేను చంద్రబాబులా కాకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా’ అని ఆయన అన్నారు.

‘మేం ఏం చేయబోయేది ముందుగానే ప్రకటిస్తాం. మా మ్యానిఫెస్టోను ఇంటర్నెట్‌లో పెడతాం. మేం ఇచ్చిన మాటకు కట్టుబడకపోతే ఎవరైనా మమ్మల్ని ప్రశ్నించవచ్చు’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో కులాలు, మతాలు, పార్టీలను చూడబోమని, అర్హులందరికీ న్యాయం చేస్తామని అన్నారు. మేం విలువలతో కూడిన రాజకీయం చేస్తామని స్పష్టం చేశారు.

పార్టీలోకి రావాలంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని శిల్పా చక్రపాణిరెడ్డికి సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. రాజీనామా చేశాకే చక్రపాణిరెడ్డి తమ పార్టీలో చేరారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విలువలకు తిలోదకాలిచ్చారని, నిస్సిగ్గుగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. పోలవరం అవినీతిపై భవిష్యత్తులో కచ్చితంగా విచారణ జరుగుతుందని అన్నారు. కాంట్రాక్ట్‌లు, సబ్‌ కాంట్రాక్ట్‌ల పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. ప్రాజెక్టులకు సంబంధించి ఇబ్బడిముబ్బడిగా అంచనాలు పెంచుతున్నారన్నారు. అవినీతిపరులు, అక్రమార్కులకు చంద్రబాబు అండగా నిలిచారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని, వైఎస్సార్‌ హయాంలో 90శాతం పూర్తైనా ప్రాజెక్టుల గేట్లు తెరిచి.. తానే కట్టానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.

గ్రామీణ మహిళల కష్టాలు తెలియనివారే పెన్షన్లపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ధర్మవరంలో చేనేత మహిళల కష్టాలు చూశాకే.. 45 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే ‘వైఎస్‌ఆర్‌ చేయుత’ పథకం కింద నెలకు రూ. 2వేల పెన్షన్‌ ఇస్తానని తెలిపారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా చెల్లిస్తామని తెలిపారు. రూ. వెయ్యి కంటే ఎక్కువగా వచ్చే వైద్య బిల్లులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని చెప్పారు.

దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు. రైతులకు ఏటా రూ. 12,500 మే నెలలోనే చెల్లిస్తామని అన్నారు. పంటలకు ముందే గిట్టుబాటు ధర ప్రకటించి కొనుగోలు చేస్తామని తెలిపారు. ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళలకు ఎంత రుణం ఉంటే అంత నాలుగు విడతల్లో నగదురూపంలో చెల్లిస్తామని చెప్పారు. ప్రతి జర్నలిస్ట్‌కు కచ్చితంగా ఇళ్లస్థలం ఇస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *