దిగ్భ్రాంతికర సంఘటన. భర్తను బెదిరిస్తూ భార్యకు వాతలు .***రాజకీయాలపై అప్పుడు స్పందిస్తా: JD లక్ష్మీనారాయణ***దిల్లీపై ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోహ్లీ***ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల***సినీ హీరో తండ్రికి జైలు శిక్ష . బ్యాంకు మోసం కేసులో కోర్టు తీర్పు***తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు***జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి - కుప్ప‌కూలిన స‌భ వేదిక‌***కోహ్లీకి-ధోనీకి ఇదే తేడా! కోహ్లీ.. కాస్త దూకుడు తగ్గించుకో***సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు***ప్రభుత్వం సంచలన నిర్ణయం

లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌

లైంగిక వేధింపుల ఆరోపణలపై విశాఖపట్నం మూడో పట్టణ సి.ఐ. బెండి వెంకటరావును సస్పెండ్‌ చేస్తూ విశాఖ సీపీ టి.యోగానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ప్రబుద్ధుడిపై సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న విశాఖ నగరానికి చెందిన యువతి మూడో పట్టణ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు.ఆ కేసు దర్యాప్తు పేరుతో సీఐ వెంకట్రావు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన అభ్యంతరకర ప్రవర్తనను నిరూపించే విధంగా బాధితురాలు పక్కా సాక్ష్యాలు సేకరించి నేరుగా కమిషనర్‌కు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆయన సి.ఐ.ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *