కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

దిల్లీ: న్యాయచరిత్రలో తొలిసారిగా దేశ సర్వోన్నత న్యాయస్థాన సీనియర్‌ న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడారు. అది కూడా ఒకేసారి నలుగురు జడ్జీలు మీడియా ముందుకు వచ్చారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ నివాసంలో చలమేశ్వర్‌ సహా సీనియర్‌ జడ్జీలు జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ కీలక సమావేశం ఏర్పాటుచేశారు.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థపై సీనియర్‌ న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జస్టిస్‌ చలమేశ్వర్‌ మాట్లాడుతూ..‘భారత చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న సమావేశం ఇది. స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం మనలేదు. సుప్రీంకోర్టులో పాలనా వ్యవస్థ సరైన క్రమంలో లేదు. గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో అవాంఛిత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాలనా వ్యవస్థను సరిదిద్దాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరాం. అయితే ఆయనను ఒప్పించడంలో మేం విఫలమయ్యాం. జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చెప్పడం తప్ప మా ముందు మరో మార్గం లేదు.అందుకే మీడియా ముందుకు వచ్చాం.’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *