కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు

హైదరాబాద్‌: ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా హనుమంతరావుకు నివాళులు అర్పించేందుకు బ్రహ్మానందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఎస్సార్‌ నగర్‌లోని ఆయన నివాసానికి వచ్చారు. హనుమంతరావుతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

* ‘గుండు హనుమంతరావు చనిపోయారన్న వార్త వినగానే అసలు నమ్మశక్యం కాలేదు. ఎందుకంటే నాకు, శివాజీ రాజాకు, హనుమంతరావుకు ఉన్న అనుబంధం అలాంటిది. ఆయన చనిపోయారనగానే ఏదో తెలీని అలజడి. వెంటనే శివాజీ రాజాకు ఫోన్‌ చేశాను. చాలా సార్లు గుండు హనుమంతరావు ఇంటికి వెళ్లాను. వెళ్లిన ప్రతీసారి ఎంతో ఆప్యాయతగా పలకరించేవారు. కల్మషం లేని వ్యక్తి’ అని బ్రహ్మానందం కంటతడి పెట్టారు.

* ‘గుండు హనుమంతరావు మంచి ఆర్టిస్ట్‌. మంచి వ్యక్తి. ఏ సన్నివేశం ఇచ్చినా కామెడీకి కామెడీ.. సెంటిమెంట్‌కి సెంటిమెంట్‌ పండించేవారు. ఇంత మంచి ఆర్టిస్ట్‌ ఒక రేంజ్‌కి ఎదుగుతారని అనుకున్నాం కానీ అలా రాలేకపోవడం నిజంగా దురదృష్టం. ఆయన లేకపోవడం చాలా బాధాకరం. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాలో గుండు పాత్రను ఆయన కోసమే రాశాను. ఎలాంటి కామెడీనైనా పండించగల వ్యక్తి గుండు హనుమంతరావు. ఇప్పటికీ ఆయన కామెడీ స్టైల్‌ వేరు.’- ఎస్వీ కృష్ణారెడ్డి

* ‘హనుమంతరావు, బ్రహ్మానందం, నేను ఒకేసారి చిత్ర పరిశ్రమలోకి వచ్చాం. 30 ఏళ్ల పరిచయం మాది. ‘అమృతం’ సీరియల్‌తో మా ఇద్దరికి మంచి పేరు వచ్చింది. తన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా..‘శివ ఇంటికి రా’ అని పిలిచేవారు. మా 30 ఏళ్ల పరిచయంలో హనుమంతరావు ఎవరి ఇంటికైనా ఖాళీ చేతులతో వెళ్లడం చూడలేదు. అతని భార్య పోవడం చూశాను, కూతురు పోవడం చూశాను. కానీ హనుమంతరావు ఇంత త్వరగా వెళ్లిపోతాడని అనుకోలేదు’- శివాజీ రాజా

* ‘నాకు, గుండు హనుమంతరావుకి ఎప్పటినుంచో పరిచయం ఉంది. నాటక రంగంలోకి వచ్చి అక్కడినుంచి సినిమా రంగానికి వచ్చారు. ఎన్నో దేశాల్లో దాదాపు 3000 ప్రోగ్రామ్‌లలో పాల్గొని మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి మంచి మనిషి ఈరోజు లేరంటే నమ్మలేకపోతున్నాను’- మురళీ మోహన్‌

* ‘గొప్ప నటుడు, మంచి వ్యక్తి. మీరు ఈ లోకంలో లేకపోయినా మిమ్మల్ని ఎన్నటికీ మర్చిపోలేం.’- మంచు మనోజ్‌

* ‘గుండు హనుమంతరావు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’- సుధీర్‌ బాబు

* ‘చిత్ర పరిశ్రమ మంచి నటుడ్ని కోల్పోయింది. ఆరోగ్యకరమైన హాస్యాన్ని యావత్‌ తెలుగు ప్రేక్షకులకు పంచిన గుండు హనుమంతరావు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయనతో కొన్ని సినిమాల్లో కలిసి నటించాను. మృదు స్వభావి. ఆయన ఆత్మకు శాంతి చేకూరి, దేవుడు ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’- నందమూరి బాలకృష్ణ

* ‘మా నిర్మాణ సంస్థ నిర్మించిన చాలా సినిమాల్లో నటించారు గుండు హనుమంతరావు. మంచి నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సమర్థుడు. అలాంటి వ్యక్తి నేడు మనల్ని భౌతికంగా విడిచి వెళ్లడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోనిబ్బరం ప్రసాదించాలని ఆ షిరిడి సాయినాథుడిని వేడుకుంటున్నాను’- మోహన్‌బాబు

* ‘గుండు హనుమంతరావు ఆత్మకు శాంతి కలగాలని, వారికి పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆకాంక్షిస్తున్నాను’- పరుచూరి గోపాలకృష్ణ

* ‘గుండు హనుమంతరావు ఇక లేరని తెలిసి చాలా బాధపడ్డాను. ‘అమృతం’ సీరియల్‌లో ఆయన పోషించిన పాత్ర అంటే నాకు చాలా ఇష్టం’- నాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *