కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .

2019లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పోరాట యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పెద్దల ఆశీస్సులతో, యువత మద్దతుతో, అక్కాచెల్లెళ్ల తోడుతో 2019కి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’ అని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై అవగాహన కోసమే జనసేన పోరాట యాత్ర చేపట్టినట్లు పవన్‌ తెలిపారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి పోరాట యాత్ర ప్రారంభించారు. శనివారం రాత్రి ఇచ్ఛాపురంలో బస చేసిన ఆయన ఈరోజు ఉదయం 8.30 గంటలకు కవిటి మండలం కపస కుర్ది వద్ద సముద్ర తీరంలో గంగ పూజలు చేశారు. అక్కడి నుంచి పోరాట యాత్రకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి యాత్రగా వెళ్లనున్న పవన్‌.. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక సూరంగి రాజావారి మైదానంలో జరిగే బహిరంగసభలో పవన్‌కల్యాణ్‌ పాల్గొంటారు. అక్కడి నుంచి కవిటి మండలంలో పోరాట యాత్ర సాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *