రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌

జగన్‌ ఉన్మాదం తారాస్థాయికి చేరుతోంది

అమరావతి: వైకాపా అధినేత జగన్‌ ఉన్మాదం రోజురోజుకీ తారాస్థాయికి చేరుతోందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్‌ అధికారం కోసం ప్రజలకు కీడు చేసేందుకు కూడా వెనకాడట్లేదని ఆరోపించారు. తన రాజకీయ జీవితంగా ఇలాంటి విపరీత ధోరణి ఉన్న నేతను ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ ఔన్నత్యానికి జగన్‌ కళంకం తెస్తున్నారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి ఎన్ని తిట్లు తిడితే అన్ని ఓట్లు పడతాయని జగన్‌కు ఎవరో చెప్పినట్లున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పదవి దక్కదనే అక్కసుతోనే జగన్‌ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని.. ఉన్మాద లక్షణాలున్న ఇలాంటి నాయకుడు ఇలాంటి ప్రతిపక్షనేతగా పనికిరాడన్నారు. జగన్‌ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించి కఠినచర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *