కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

నాగచైతన్యకు సమంత ఫిక్స్ కాకుంటే నేను ట్రై చేసేవాడిని!: సాయిధరమ్ తేజ్

హైదరాబాద్ లోని సీఆర్ క్వార్టర్స్ లోని ఓ బెటాలియన్ తో సాయి ధరమ్ ఈ రోజు సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా పోలీసులులు అడిగిన పలు ప్రశ్నలకు సాయిధరమ్ సమాధానాలు ఇచ్చాడు. తనకు ఇష్టమైన హీరోయిన్ సమంత అని, చాలా బాగుంటుందని, సమంతకు నాగచైతన్య ఫిక్స్ కాకుంటే తాను ట్రై చేసేవాడినని నవ్వుతూ అన్నాడు. తనకు ఇష్టమైన స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ అని చెప్పిన సాయిధరమ్ తనకు నచ్చిన హీరోల గురించి కూడా చెప్పాడు.

తన మామయ్య మెగాస్టార్ చిరంజీవి తర్వాత తనకు నచ్చిన హీరోలు రవితేజ, ప్రభాస్ అని చెప్పుకొచ్చాడు. రవితేజ ఎనర్జీ లెవెల్స్ తనకు బాగా ఇష్టమని, మల్టీ స్టారర్ చిత్రం చెయ్యాల్సి వస్తే రవితేజతో కలిసి నటించేందుకు తాను మొగ్గు చూపుతానని అన్నాడు. ఈ సందర్భంగా హీరోయిన్ రెజీనా గురించీ ప్రస్తావించాడు. తన మొదటి హీరోయిన్ రెజీనా అని, తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని అన్నాడు. కాగా,కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీ స్టారర్ చిత్రం ‘నక్షత్రం’. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ పోలీసు పాత్రలో నటించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *