కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

వైఎస్ జ‌గ‌న్‌పై కేసు న‌మోదు

నంద్యాల‌లో ఉప‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబుని కాల్చేయాల‌ని, ఉరితీసినా త‌ప్పులేద‌ని జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రం తెలుపుతూ ఎన్నిక‌ల సంఘానికి టీడీపీ నేత‌లు ఫిర్యాదు కూడా చేశారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను పరిశీలించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆయ‌న‌ వ్యాఖ్య‌లు క‌చ్చితంగా నిబంధ‌న‌ల‌ ఉల్లంఘ‌న‌ల కిందకే వస్తాయని పేర్కొంది. ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నంద్యాల‌లోని మూడ‌వ ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్‌లో పోలీసులు ఈ రోజు కేసు న‌మోదు చేశారు. ఐపీసీ 188, 504, 506 ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం 125 ప్ర‌కారం కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *