రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌

తిరిగి బాగు చేసే ఎవరు కేటీఆర్‌కు మంచు లక్ష్మి బహిరంగ లేఖ

హైదరాబాద్‌: సినీ నటి మంచు లక్ష్మి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌ నగరానికి జరుగుతున్న నష్టం గురించి ప్రస్తావించారు. వినాయక మండపాలను నిర్మించడానికి రోడ్లను తవ్వుతున్నారని, ఫిల్మ్‌ నగర్‌ రోడ్డు నంబరు 1లో తాను ఆ దృశ్యాన్ని చూశానని చెప్పారు. ఇంతే కాదు.. ఎత్తైన గణపతి విగ్రహాలను తరలించడానికి అడ్డంగా ఉన్న కేబుల్‌ వైర్లను కూడా కట్‌ చేశారని చెప్పారు. వీటిని తిరిగి బాగు చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారో ఓ సిటిజన్‌గా తాను తెలుసుకోవాలని అడుగుతున్నట్లు ప్రశ్నించారు.
ఇప్పుడు గణేశ్‌ పండగను మతపరంగా భావించకుండా ఓ పోటీగా భావిస్తున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. వేడుకను ఇతరుల కన్నా వైభవంగా, గొప్పగా జరపాలని చాలా కష్టపడుతున్నారని అన్నారు. అలా కాకుండా ఓ ప్రాంతానికి ఒకే మండపం ఉండేలా చర్యలు తీసుకుంటే బావుంటుందని సలహా ఇచ్చారు. దీని వల్ల ఒకే ప్రాంతంలోని వ్యక్తుల్లో ఐక్యత పెరగడమే కాకుండా కలిసి పండగను జరుపుకొని, సంప్రదాయాన్ని కాపాడాలనే ఆలోచన వస్తుందని పేర్కొన్నారు.

వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వారి చుట్టుపక్కల ఉన్న ఇలాంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొస్తారనే ఉద్దేశంతో పబ్లిక్‌ మాధ్యమం (ట్విటర్‌) ద్వారా ఈ సమస్యను తెలుపుతున్నానని కేటీఆర్‌కు చెప్పారు. ఆయన వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటారన్న విషయం తనకు తెలుసని పేర్కొన్నారు.
భవిష్యత్తులో గణపతి విగ్రహాల ఎత్తుపై పరిమితులు పెట్టాలని మంచు లక్ష్మి కోరారు. హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతున్న నగరంగా ముందంజలో ఉందని.. మన నగరాన్ని ఇలా చేయడం తనను చాలా బాధించిందని ఆమె తెలిపారు. మట్టి గణపతి విగ్రహాలకు ఆదరణ పెరగడం ఆనందంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు ఫిల్మ్‌నగర్‌లో గణపతి వేడుక కోసం రోడ్డును తవ్వి, కట్టెలు కడుతున్న ఫొటోను పోస్ట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *