రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌

ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది భారతీయులు దుర్మరణం.

బ్రిటన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. గత 24 ఏళ్లలో ఇదే అత్యంత ఘోర రోడ్డు ప్రమాదమని అధికారులు తెలిపారు. బకింగ్‌హామ్‌షైర్‌లోని న్యూపోర్ట్ పాగ్నెల్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విప్రో ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో వెళ్తున్న మినీబస్ అదుపు తప్పి రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విప్రో ఉద్యోగులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ కూడా భారతీయుడే. మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు లారీ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు పెట్టిన పోలీసులు నేడు (సోమవారం) కోర్టులో హాజరు పరచనున్నారు. నవంబరు, 1993 తర్వాత బ్రిటిష్ మోటార్ వేపై జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదం ఇదేనని అధికారులు తెలిపారు. ఆ ప్రమాదంలో 12 మంది చిన్నారులు, వారి టీచర్ ప్రాణాలు కోల్పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *