రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌

గుర్మీత్‌కు ప‌దేళ్ల జైలు శిక్ష‌

రోహ్‌త‌క్‌: రేప్ కేసులో దోషిగా తేలిన గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌కు ప‌దేళ్ల జైలు శిక్ష విధించారు సీబీఐ కోర్టు జ‌డ్జి జ‌గ్‌దీప్ సింగ్‌. తాను ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేశాన‌ని, ద‌య చూపాల‌ని కంట‌త‌డి పెట్టినా.. న్యాయ‌మూర్తి మాత్రం క‌రుణించ‌లేదు. గుర్మీత్‌కు ఇప్ప‌టికే వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత అత‌నికి జైలు యూనిఫాం ఇచ్చి, ఓ ప్ర‌త్యేక సెల్ కేటాయించారు. అత‌నికి ఖైదీ నంబ‌ర్ 1997ను ఇచ్చారు. అటు సీబీఐ మాత్రం జీవిత ఖైదు విధించాల‌ని వాదించింది. ఈ శిక్ష‌తో సీబీఐ సంతృప్తి చెంద‌లేదు. శిక్ష‌ను పెంచాల‌ని కోర‌నున్న‌ట్లు సీబీఐ స్ప‌ష్టంచేసింది. 15 ఏళ్ల కింద‌ట త‌న ఇద్ద‌రు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌న్న ఆరోప‌ణ‌లు గుర్మీత్‌పై ఉన్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో అత‌న్ని మూడు రోజుల కింద‌టే దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు.. ఇవాళ శిక్ష ఖ‌రారు చేసింది. తీర్పు నేప‌థ్యంలో హ‌ర్యానా మొత్తం భారీగా బందోబ‌స్తు ఏర్పాట్లు చేశారు. అయినా అత‌ని అనుచ‌రులు మాత్రం హింస‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. సిర్సాలో ఇప్ప‌టికే రెండు వాహ‌నాల‌కు నిప్పు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *