రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌

నంద్యాల ఉప ఎన్నికకు తెదేపా రూ.200కోట్లు ఖర్చుచేసింది: జగన్‌

హైదరాబాద్‌: నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని వైకాపా అధినేత జగన్‌ ఆరోపించారు. నంద్యాల ఉపఎన్నిక ఫలితంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నిక కోసం తెదేపా కనీసం రూ.200కోట్లు ఖర్చు చేసింది. తెదేపా నేతలు ఓటర్ల ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురిచేశారు. ఇంటింటికీ వెళ్లి తమ పార్టీకి ఓటేయకపోతే ఫించన్‌ ఇవ్వమని బెదిరించారు. ఏకంగా వైకాపా అభ్యర్థిపైనే దాడికి యత్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధికార పార్టీ నేతలు అంతగా బెదిరింపులకు పాల్పడినా ప్రజలు ధైర్యంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవడం అభినందనీయం’ అని జగన్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *