రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌

కాకినాడలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

కాకినాడ: కాకినాడ నగర పాలక ఎన్నికల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో ఉన్న ఓటర్లకు ఓటువేసే అవకాశం కల్పిస్తున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 241 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. కాకినాడలో నగర కార్పొరేషన్‌ పరిధిలో 196 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శివారు ప్రాంతాల్లోని ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి ప్రదర్శించారు. నగరంలోని మాత్రం కొంత మందకొడిగా ఓటింగ్‌ జరిగింది. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వారిని కదిలించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. సాయంత్రం 5 గంటల సమయానికి మొత్తం 64.78శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్‌ 1న ఎన్నికల లెక్కింపు చేపట్టనున్నారు. కాకినాడ పురపాలక పరిధిలో మొత్తం 2,29,373 మంది ఓటర్లు ఉన్నారు.
కాకినాడ నగరపాలక ఎన్నికల్లో తొలిసారి 2005లో 67 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2014లో 67శాతం నమోదైంది. ఈ సారి కూడా ఆ స్థాయి వరకు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అనారోగ్య పీడితులు, వయో వృద్ధులను పోలింగ్‌ కేంద్రాలకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు తరలించారు. తమకు అనుకూలంగా ఓటు వేయించేందుకు ఇంటింటికీ వెళ్లి తమ ప్రయత్నాలను కొనసాగించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలోనే ఈ ఓటింగ్‌ జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *