కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

గర్భిణీకి సర్జరీ చేస్తూ తిట్టుకున్న వైద్యులు

గర్భిణీకి సర్జరీ చేస్తూ ఇద్దరు వైద్యులు ఒకర్నొకరు తిట్టుకున్నారు. ఫలితంగా.. ఆ పసిబిడ్డ పుట్టీపుట్టగానే కన్నుమూసింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.వివరాల్లోకెళితే.. జోధ్‌పూర్‌లోని స్థానిక ఉమైద్‌ హాస్పిటల్‌లో మంగళవారం ఓ గర్భిణీ డెలివరీకి వచ్చింది.
అప్పటికే బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న సర్జన్లు అశోక్‌, తక్‌.. ఆమెకి సర్జరీ చేయాలనుకున్నారు. అన్ని సిద్ధం చేసి ఆమెను ఆపరేషన్‌ థియేటర్‌కి తరలించారు. ఈ నేపథ్యంలో ఆమె ఉదయం ఏం ఆహారం తీసుకుందన్న విషయమై ఇద్దరు వైద్యుల మధ్య గొడవ మొదలైంది. సర్జరీ చేస్తూ ఒకర్నొకరు బెదిరించుకున్నారు. అక్కడే ఉన్న మరో ఇద్దరు వైద్యులు వారికి సర్దిచెప్పడానికి యత్నించారు. అయినా వారు వినిపించుకోలేదు. ఇద్దరూ గొడవపడుతూ.. ఆఖరికి ఆ తల్లికి కడుపుకోత మిగిల్చారు. బిడ్డ పుట్టగానే కొద్దిసేపటికే చనిపోయింది.
ఈ దృశ్యాన్ని ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్న ఓ నర్సు చిత్రించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో యాజమాన్యం వెంటనే ఇద్దరు వైద్యులను విధుల నుంచి తొలగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *