తుదిశ్వాస విడిచిన గుండు హనుమంతరావు.. ప్రముఖుల నివాళులు***జగన్‌ పాదయాత్రలో అపశ్రుతి - కుప్ప‌కూలిన స‌భ వేదిక‌***కోహ్లీకి-ధోనీకి ఇదే తేడా! కోహ్లీ.. కాస్త దూకుడు తగ్గించుకో***సుప్రీంకోర్టు జ‌డ్జిలు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు***ప్రభుత్వం సంచలన నిర్ణయం***లాలూ ప్రసాద్ యాదవ్‌ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష***లైంగిక వేధింపుల నేపథ్యంలో సీఐ సస్పెన్షన్‌***నిబద్ధతతో పనిచేస్తా. నేను చంద్రబాబులా కాదు.. మీడియాతో వైఎస్‌ జగన్‌ చిట్‌చాట్‌!***అనంత‌లో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర***త్రిపుర మాజీ డీజీపీ నాగరాజుకు సీబీఐ కోర్టు క్లీన్‌చిట్

9 మందికొత్త మంత్రులు వీరే

[కేంద్ర మంత్రి మండలి పునర్వ్యస్థీకరణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రపతిభవన్‌లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో కొత్తగా 9 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలు భారీ కసరత్తుతో కొత్త మంత్రులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు మరో 21 నెలలు సమయమే మిగిలి ఉండటం, వచ్చే ఏడాది లోపల కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చేపడుతున్న కేంద్ర మంత్రి మండలి విస్తరణలో ప్రభుత్వాధినేతగా తన జట్టు అన్ని విధాలా అత్యుత్తమంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావిస్తున్నారు. పనితీరు సంతృప్తికరంగాలేని మంత్రులను నిర్మొహమాటంగా రాజీనామా చేయాలని సూచించటం దీనిలో భాగమేనని అంటున్నారు.
తెరపైకి వచ్చిన పేర్లివే..: హర్దీప్‌ పూరీ, సత్యపాల్‌ సింగ్‌, అల్ఫోన్స్‌ కన్నన్‌తనం, అశ్వినీకుమార్‌ చౌబే, వీరేంద్ర కుమార్‌, శివప్రతాప్‌ శుక్లా, అనంత్‌కుమార్‌ హెగ్డే, రాజ్‌కుమార్‌సింగ్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌లు ఆదివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. వీరందరికీ కీలకమైన శాఖలను అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరిలో హర్దీప్‌ సింగ్‌ మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి కాగా, సత్యపాల్‌ సింగ్‌ ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌, అల్ఫోన్స్‌కన్నన్‌తనం విశ్రాంత ఐఏఎస్‌ అధికారి. 2016 జులైలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అయిదుగురు మంత్రులను తన జట్టు నుంచి తప్పించారు. ఇద్దరి హోదాలు తగ్గించారు. కొత్తగా 19 మందికి చోటు కల్పించారు. అయితే, అప్పట్లో యూపీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కొన్ని సమీకరణలను పరిగణనలోకి తీసుకొని కొందరికి మంత్రిమండలిలో అవకాశం కల్పించారు. ఇప్పుడు కూడా వచ్చే ఏడాది లోపల గుజరాత్‌, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత ఏడాదిలోనే సాధారణ ఎన్నికలు… ఇక మిగిలిన సమయంలో మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు పెద్దగా అవకాశం ఉండకపోవచ్చు కనుక వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వాధినేతగా ప్రధాని మోదీ, అధికార పార్టీ అధ్యక్షునిగా అమిత్‌షా ప్రస్తుత పునర్వ్యస్థీకరణపై భారీ కసరత్తు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మోదీ మంత్రి మండలిలో 73 మంత్రులు ఉన్నారు. వీరిలో ఏడుగురు రాజీనామాలు సమర్పించారని తెలుస్తోంది. వీరందరి రాజీనామాలను ప్రధాని ఆమోదిస్తే మంత్రివర్గ సభ్యుల సంఖ్య 66కు చేరుతుంది. కేబినెట్‌లో గరిష్ఠంగా 81 మందికే అవకాశం ఉంది కనుక కొత్తగా 15 మందిని చేర్చుకునే వీలుంది. ప్రస్తుతానికి తొమ్మిదిమందికే పరిమితమైనట్లు తెలుస్తోంది.
మోహన్‌ భగవత్‌తో అమిత్‌షా ప్రత్యేక భేటీ: బృందావన్‌లో జరిగిన ఆరెస్సెస్‌, అనుబంధ సంఘాల సమావేశానికి హాజరైన భాజపా అధ్యక్షుడు అమిత్‌షా…శుక్రవారం రాత్రి సంఘ్‌ అధినేత మోహన్‌ భగవత్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రివర్గ కూర్పుపైనే ప్రధానంగా చర్చించి ఉండవచ్చని తెలుస్తోంది.
జేడీయూ, శివసేనలకు పిలుపులేదు: ఇటీవలే ఎన్‌డీఏలో చేరుతున్నట్లు ప్రకటించిన బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌.. కేంద్ర మంత్రిమండలి విస్తరణపై తమకు సమాచారంలేదని పట్నాలో అన్నారు. ఎన్‌డీఏలో మరో భాగస్వామ్య పక్షం శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే కూడా తమకు మరో మంత్రిపదవి కేటాయించటంపై భాజపా అధిష్ఠానం నుంచి ఎలాంటి సమాచారం అందలేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *