రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు***కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత***మరో మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు***రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి***జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం***మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి కన్నుమూత***సైకిల్ తొక్కిన చంద్ర‌బాబు***ఏపీ డీజీపీగా సాంబశివరావు కొనసాగింపు?***సంతకం పెట్టమన్నందుకు చెవిరెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం!***122 మంది సీఐలకు ప్రమోషన్‌

చైతన్యకు రాఖీ కడతాననున్న సమంత

సమంత ప్రేమను గెలుచుకునేందుకు ఆమెతో చిన్నపాటి యుద్ధం చేయాల్సి వచ్చిందని కథానాయకుడు అక్కినేని నాగచైతన్య అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘యుద్ధం శరణం’. లావణ్య త్రిపాఠి కథానాయిక. కృష్ణ మరిముత్తు దర్శకుడు. సెప్టెంబరు 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చైతన్య, లావణ్యలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత ‘నిజ జీవితంలో దేని కోసమైన యుద్ధం చేయాల్సి వచ్చిందా?’ అని చైతన్యను ప్రశ్నించారు.
దీనికి చైతన్య స్పందిస్తూ.. పెద్ద ఫైట్స్‌ ఏమీ జరగలేదన్నారు. చెన్నైలో ఉన్నప్పుడు స్కూల్‌ చదువు కోసం హైదరాబాద్‌కు రావాల్సి వచ్చిందని, అప్పుడు అమ్మతో యుద్ధం చేయాల్సి వచ్చిందని చెప్పారు. ప్రేమ విషయంలో సమంతతో కూడా యుద్ధం చేశానన్నారు. ‘నువ్వు ఇంట్లో చెప్పకపోతే ఇక నేనే నీకు రాఖీ కట్టాలి.. వేరే ఆప్షన్‌ లేదు’ అని సమంత బెదిరించినట్లు చైతన్య నవ్వుతూ అన్నారు.
‘ఏమాయ చేసావె’ సమయంలో చైతన్య, సామ్‌ స్నేహితులయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. చాలా ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్నప్పుటికీ గత ఏడాది ఈ విషయాన్ని ప్రకటించారు. జనవరిలో వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. అక్టోబరు 6న గోవాలో వివాహం జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *