కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

గౌతంరెడ్డిపై సస్పెన్షన్ వేటు

వైఎస్సార్ సీపీ నాయకుడు పూనూరు గౌతంరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దివంగత నేత వంగవీటి మోహన్‌రంగా సహా వైఎస్సార్‌ సీపీ నాయకులపై గౌతంరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. గౌతంరెడ్డిపై సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. వైఎస్సార్‌ జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన వైఎస్‌ జగన్‌ ఆదివారం రాత్రి పార్టీ నాయకులతో ఈ అంశంపై చర్చించారు. గౌతంరెడ్డి వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని వైఎస్సార్ సీపీ క్రమశిక్షణా కమిటీని ఆదేశించారు.

కాగా, గౌతంరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఈ మధ్యాహ్నం వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి మీడియాతో చెప్పారు. గౌతంరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వంగవీటి మోహన్‌రంగా అంటే తమకెంతో గౌరవమని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *