కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

ముస్లింలకు శాసనమండలి ఛైర్మన్‌ ఖరారు.

శాసనమండలి ఛైర్మన్‌గా కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫరూఖ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌లో సెంటర్‌ ఫర్‌ లీడర్‌షిప్‌ ఎక్స్‌లెన్స్‌ పేరిట జరుగుతున్న సమావేశంలో ఫరూఖ్‌ పేరును చంద్రబాబు ప్రకటించారు. సహచర సభ్యులంతా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షద్వానాలు తెలిపారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పార్టీ అందుకున్న విజయం అన్ని నియోజకవర్గాలకు వ్యాపింపజేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గెలుపోటములు ఎప్పుడూ ప్రభావం చూపిస్తాయి. సాంకేతికతను అనుకూలంగా వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ పాలనపై 80శాతం మంది సంతృప్తి వ్యక్తం చేస్తే ప్రజల మద్దతు మనకే ఉంటుంది. ఇంక ప్రతిపక్షాలు చెప్పడానికి ఏమీ ఉండదు. పార్టీ రాష్ట్ర కార్యాలయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. దాని వేదికగా అందరూ కలిసి పనిచేద్దాం’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *