కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

ఒక్కరోజే రూ.990 పెరిగిన పసిడి

ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్‌ ఇర్మా ప్రభావంతో శుక్రవారం పసిడి ధర పది నెలల గరిష్ఠానికి చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే రూ.990లు పెరిగింది. ఈ ఏడాదిలో ఇంతగా బంగారం ధర పెరగడం ఈరోజే. దీంతో పది గ్రాముల పసిడి ధర రూ.31,350కి చేరుకుంది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి రూ.42వేలకు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో వెండి ధర పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. 2015 కనిష్ఠానికి డాలర్‌ విలువ పడిపోవడం అంతర్జాతీయ మార్కెట్‌కు కలిసొచ్చిందని బులియన్‌ ట్రేడర్లు చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధర 0.31శాతం పెరగడంతో ఔన్సు 1,352.80డాలర్లు పలికింది. 2016 సెప్టెంబరు తర్వాత ఔన్సు ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *