కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

జగన్‌ డిశ్చార్జి పిటిషన్‌పై వాదనలు

అక్రమాస్తుల కేసులో భాగంగా జగతి పబ్లికేషన్స్‌లో ముగ్గురు వ్యాపారుల పెట్టుబడులకు సంబంధించిన ఛార్జిషీట్‌లో జగన్‌ వేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌పై శుక్రవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. కేసు నుంచి తనను తొలగించాలంటూ జగన్‌ దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌ కొట్టివేయాలంటూ ఇప్పటికే సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. ఇవాళ సీబీఐ కోర్టులో జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఉమా మహేశ్వరరావు వాదనలు వినిపించారు.
పెట్టుబడుల వ్యవహారంలో క్విడ్‌ ప్రోకో గానీ, ప్రజా ప్రయోజనాలు గానీ ఏమీ లేవని.. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసిందని వాదించారు. పెట్టుబడుల వ్యవహారం పూర్తిగా కంపెనీ చట్టం పరిధిలోని వ్యాపార సంబంధిత అంశమని పేర్కొన్నారు. తదుపరి వాదనలు ఈ నెల 22న జరగనున్నాయి.
ఇవాళ సీబీఐ, ఈడీ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణకు జగన్‌, విజయ్‌సాయిరెడ్డి, ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు జగన్‌ కోర్టులోనే ఉన్నారు. ఈడీకి సంబంధించిన రెండు కేసుల్లో కూడా తమను తొలగించాలంటూ జగన్‌, విజయ్‌సాయిరెడ్డి డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *