కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

ఆమెకు 11 మంది భ‌ర్త‌లు.. మ‌రో నలుగురితో ఫిక్షేష‌న్ !

కంటికింపైన అందం…అకట్టుకునే సంభాషణా చాతుర్యం….ఎంతటి మోసానికైనా పాల్పడగల గుండెధైర్యం…కనీస మానవత్వంలేని కఠినహృదయం….అమాయకత్వం నటించగల చాకచక్యం….ఎదుటివారిని ఇట్టే బుట్టలోపెట్టేయగల జాణతనం…మొత్తం మీద విలువలన్నిటికీ తిలోదకాలిచ్చేసిన ఓ యువతి రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 11 మందిని ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుంది. ఒక్క ఆగస్టులోనే ఆమె ఏకంగా నలుగురిని పెళ్లాడేసింది. డబ్బులు తీసుకుంది. వరుడే వధువుకు కట్నంగా డబ్బు ఇచ్చే థాయ్‌ సంప్రదాయాన్ని ఆమె సంపూర్ణంగా వినియోగించుకుంది. ఎంచుకున్న మగాళ్లను పెళ్లిదాకా లాగి…వారితో సహజీవనం చేసి…వాళ్లిచ్చిన డబ్బు తీసుకుని చివరకు పత్తా లేకుండా పోయేది. ఇలా పదకొండు మందిని వివాహం చేసేసుకుని ఒక్కొక్కరి దగ్గర నుంచీ కనీసం మూడున్నర లక్షల నుంచి సుమారు 19 లక్షల రూపాయల దాకా దండుకునేది. తమ కుటుంబంలో ఏదో అత్యవసర పరిస్థితి వచ్చిందనో…మరేదో సాకు చెబుతూ వెళ్లిన మనిషి ఇక పత్తా ఉండేదే కాదు. బాధితుల్లో ఎవరో ఒకరు ఫేస్‌బుక్‌లో ఈ వివరాలు ఉంచడంతో ఏకంగా 11 మంది పోలీసుల దాకా వచ్చారు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొన్నారు. ‘ది బాంకాక్‌ పోస్ట్‌’…ఇతరత్రా థాయ్‌ మీడియాలో ఈమె కథనాలు ఆసక్తికరంగా వెలువడ్డాయి.ఆమెను ‘పరారయ్యే వధువు’గా పేర్కొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *