కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

బ్యాంక్‌ మేనేజరుకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

బ్యాంకు క‌స్ట‌మ‌ర్ జమ చేసిన సొమ్మును ఇతర ఖాతాల్లోకి మళ్లించి సొంతానికి వినియోగించారన్న కారణంతో దాఖలైన కేసులో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఇండియన్‌ బ్యాంక్‌ అప్పటి మేనేజరు ఎస్‌.సత్యనారాయణకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కుట్రలో భాగస్వాములైన సి.కరుణాకర్‌బాబు, జి.అనంతకుమార్‌, పి.సందీప్‌లకు ఏడేళ్లు, అశోక్‌కుమార్‌, సుధీర్‌, బి.కె.మంజునాథలకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దోషులందరికి కలిపి రూ.40 లక్షల జరిమానా విధించింది. మలేసియాలో స్థిరపడిన విశ్వంబర్‌ సుందర్‌దాస్‌ బదానీ 2002-03లో గంగాధర నెల్లూరు ఇండియన్‌ బ్యాంక్‌, కొంగారెడ్డిపల్లి బ్యాంక్‌లతోపాటు పలు బ్యాంకుల్లో సొమ్మును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. మేనేజరు సత్యనారాయణ పలువురితో కలిసి తప్పుడు పత్రాలతో ఆ సొమ్మును మళ్లించగా సీబీఐ(ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *