కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

ప్రాణ రక్షకుడిగా మారిన ఎంపీ..సర్వత్రా ప్రశంసలు !

కాంగ్రెస్ నేత, ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా ప్రాణ రక్షకుడిగా మారారు. భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఆయన ఓ ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడారు. ఆగ్రా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఈ రైలులో ఓ ప్రయాణికురాలికి అర్ధరాత్రి వేళ గుండెపోటు వచ్చింది. తన సీటుకు ఎదురుగా కూర్చున్న బాధితురాలు గుండె నొప్పితో తన కళ్ళెదుటే కుప్పకూలిపోవడం చూసి సింథియా చలించిపోయారు. రైలులో అత్యవసర వైద్య సదుపాయాలు ఉన్నాయా? అని వాకబు చేశారు. అలాంటివేవీ లేవని ఆయనకు తెలిసింది. వెంటనే ఆయన రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు ఫోన్ చేశారు. తక్షణమే స్పందించిన రైల్వే మంత్రి ఓ అంబులెన్స్‌ను పంపించారు. శనివారం – ఆదివారం మధ్య రాత్రి 2.30 గంటలకు బాధితురాలిని రైల్వే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆమెకు సకాలంలో చికిత్స అందడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సింథియా చొరవను అందరూ ప్రశంసిస్తున్నారు. అదేవిధంగా అత్యవసర వైద్య సదుపాయాలను కల్పించడంలో రైల్వే శాఖ విఫలమైందని ఆరోపిస్తున్నారు. రైలును ఢిల్లీ ఔటర్ సిగ్నల్ వద్ద దాదాపు రెండు గంటలపాటు నిలిపేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *